ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలి

 ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలని, అది ఒక్క ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేదరికం నుంచి బయటపడాలి అంటే చదువు చాలా ముఖ్యమని, తమ ప్రభుత్వంలో చదువుకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. విజయవాడలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో  సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. అబుల్‌ కలాం జయంతిని 2008లో మైనార్టీ వెల్ఫేర్ డేగా నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అధికారికంగా నిర్వహించారని గుర్తుచేశారు. విద్యాసంస్థల అభివృద్ధి కోసం అబుల్‌ కలాం ఆజాద్‌ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. 1947 నుంచి 1958 వరకు మౌలానా విద్యాశాఖ మంత్రిగా విశేష సేవలు అందిచారని కొనియాడారు. అనేక విద్యా సంస్థలను పునాది వేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ.. ప్రజాసంకల్ప యాత్రలో  పేదరికంను, వెనుకబాటును అతి దగ్గరగా చూశానని అన్నారు. దీనంతటికీ కారణం పిల్లలకు నాణ్యమైన విద్యలేకపోవడమే పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top