మరో చరిత్రకు శ్రీకారం

మాట ఇచ్చిన చోటే మరో చరిత్రకు శ్రీకారం చుడుతూ ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఏలూరులో ప్రారంభించనున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో ఆటోడ్రైవర్ల కష్టాలు చూసి చలించిన వైఎస్‌ జగన్‌ ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌ల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం ఏటా  రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందచేస్తామని నాడు ఏలూరులో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే నేడు  వైఎస్సార్‌ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించనున్నారు. మాట ఇచ్చిన చోటు నుంచే పథకానికి శ్రీకారం చుట్టడం అరుదైన విషయమని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని ఆటో డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ పథకం ద్వారా మొత్తం 1,73,531 మంది లబ్ధి పొందనున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top