రివర్స్ టెండరింగ్ అంటే చంద్రబాబుకుఎందుకంత భయం

పోలవరం పనులు ఆపేశారంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటే చంద్రబాబుకి ఎందుకంత భయమని ప్రశ్నించారు. టెండర్ల పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు తన అనుచరులకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టుకు 50 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని ఆయన తెలిపారు. పోలవరం పై తప్పుడు ప్రచారం చేయవద్దని నవంబర్ నుంచి పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top