చక్రం తిప్పుతానని మొదట్లోనే బోల్తాపడ్డారు
అపవిత్రమైన కూటమిని ప్రజలు తెలంగాణలో తిరస్కరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దేశంలో చక్రం తిప్పుతానన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి అడుగులోనే బోల్తా పడ్డారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కోట్ల రూపాయల డబ్బును చంద్రబాబు తెలంగాణలో ప్రచారానికి ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రెండు సీట్లు గెలిచి ప్రధాని మోదీతో పోరాటం చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు చంద్రబాబుకి బుద్ది చెప్పాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని గడిచిన 3 దశాబ్దాలుగా చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని నిప్పులు చెరిగారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు