‘ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు’

 సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, తీరు మారకపోతే చర్యలు తప్పవని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో గత ఆరు నెలల్లోనే దాదాపు 170 మంది నవజాత శిశువులు మరణించడం తెలిసిందే. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో మంత్రి ఆళ్ల నాని అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారణకు ఆదేశించారని తెలిపారు. వైఎస్సార్‌ స్పూర్తితో ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top