పాక్ పోలీసుల అదుపులో భారత యువకులు
ఉత్తరప్రదేశ్‌లోని బైరాగిపట్టి మసీదులో జరిగిన పేలుడు కేసులో టోలిచౌకిలో నివసిస్తున్న ఆర్మీ మాజీ డాక్టర్ అరెస్టైన విషయం మరువక ముందే మరో కలకలం రేగింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న బహవాల్పూర్లో ఇద్దరు భారత యువకుల్ని చోలిస్తాన్ పోలీసులు ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ అని తెలుస్తోంది. వీరు అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించినట్లు ఆరోపిస్తూ అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిలో మధ్యప్రదేశ్‌కు చెందిన దరీలాల్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. వీరిలో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో పాకిస్తాన్లో ప్రత్యేక ఆపరేషన్‌కు భారత్ కుట్ర పన్నిందని పాక్ మీడియా ఆరోపించింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి