లారీ ఢీ.. ఆర్టీసీ బస్సు బోల్తా..
తూర్పుగోదావరి జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలికిపురం నుంచి వైజాగ్ వెళ్తున్న రాజోలు డిపోకు చెందిన బస్సును కాకినాడ నుంచి సత్తుపల్లి వెళ్తున్న లారీ అచ్చంపేట జంక్షన్లో వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఘటనా సమయంలో ఆర్టీసీ బస్సులో 35 మంది దాకా ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 15 మంది గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం కాకినాడకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు