రైల్యే స్టేషన్‌లో నల్లత్రాచు కలకలం

ఉత్తరాఖండ్‌లోని కత్తగోడెం రైల్వే స్టేషన్‌లో ఓ నల్లత్రాచు పాము కలకలం సృష్టించింది. 10అడుగుల పోడవున్న కింగ్‌ కోబ్రా(నల్లత్రాజు)ను అటవి అధికారులు పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఉత్తరాఖండ్‌ ‘కత్తగోడెం రైల్వే స్టేషన్‌లో రైలు కింది భాగంలో చూట్టలుగా చూట్టుకుని ఉన్న నల్లత్రాచు పామును చూసి ప్రయాణికులంతా బెంబెలేత్తిపోయారు. దీంతో రైల్వే అధికారుల ఉత్తరప్రదేశ్‌ ఆటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఆటవి అధికారులు పామును పట్టుకుని అడవిలో వదిలి పెట్టిన వీడియోను  ధఖ్తే అనే ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 28 సెకన్లు నిడివి గల ఈ వీడియోకు ఇప్పటి వరకు 5 వేలకు పైగా వ్యూస్‌ రాగా.. వందల్లో కామెంట్లు వస్తున్నాయి.  అలాగే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పామును పట్టుకున్న ఆటవీ అధికారులను నెటిజన్లంతా అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపిస్లున్నారు.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top