నారాయణ కళాశాల సిబ్బంది దౌర్జన్యం

తిరుపతికి చెందిన గోవిందరెడ్డి కుమారుడు నితిన్ నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ ఏడాదికి సంబంధించిన ఫీజు కట్టడంలో అతనికి కొంత ఆలస్యం జరిగింది. దీంతో గత శనివారం నితిన్‌ను కళాశాల సిబ్బంది అమానుషంగా కాలేజీ నుంచి గెంటి వేశారు. ఈ నేపథ్యంలో నితిన్‌ తండ్రి గోవిందరెడ్డి ఫీజు కట్టడానికి సోమవారం కళాశాలకు వెళ్లాడు. ఒక్క రోజు ఆలస్యం అయినందుకే మా అబ్బాయిని కాలేజి నుంచి గెంటేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. దీంతో నారాయణ కాలేజీ సిబ్బంది ఆయనపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. నారాయణ కాలేజీ సిబ్బంది దౌర్జన్యపూరితంగా ప్రవర్తించారని, విద్యార్థిని గెంటేయడమే కాకుండా ఇదేం పద్ధతి అని ప్రశ్నించిన తమపై దాడికి పూనుకున్నారని బాధితులు గోవిందరెడ్డి, ఆయన కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Taboola - Feed

Back to Top