పీవీ నరసింహారావు ఘాట్ వద్ద జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి(77) భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అనారోగ్యంతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి నెక్లెస్ రోడ్డులోని పీవీ నరసింహారావు ఘాట్ పక్కన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు