హమ్మయ్య.. ఔట్‌ చేశాం!

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టును ఎక్కువ విసిగించిన క్రికెటర్‌ డీన్‌ ఎల్గర్‌. గురువారం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ప్రారంభించే క‍్రమంలో ఓపెనర్‌గా దిగిన ఎల్గర్‌.. శుక్రవారం సాయంత్రం ఆరో వికెట్‌గా ఔటయ్యాడు.  ఒకవైపు దక్షిణాఫ్రికా టాపార్డర్‌లో కీలకమైన వికెట్లను భారత బౌలర్లు సాధించినప్పటికీ ఎల్గర్‌ మాత్రం పట్టువదలకుండా ఇన్నింగ్స్‌ ఆడాడు.  287 బంతులను ఎదుర్కొని భారత్‌కు పరీక్ష పెట్టాడు. దాదాపు 50 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసిన ఎల్గర్‌ 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 160 పరుగులు చేశాడు. కాగా, మూడో రోజు ఆట ఇంకా గంటలో ముగుస్తుందనగా ఎల్గర్‌ ఎట్టకేలకు ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో చతేశ్వర పుజారా అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో ఎల్గర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దాంతో హమ్మయ్య.. ఔట్‌ చేశాం అనుకోవడం భారత్‌ వంతైంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top