సముద్రపు అలలతో పోటీపడుతూ మచిలీపట్నం పోర్టు నిర్మాణం | Sakshi
Sakshi News home page

సముద్రపు అలలతో పోటీపడుతూ మచిలీపట్నం పోర్టు నిర్మాణం

Published Sat, Dec 2 2023 1:00 PM

మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తం 16 బెర్తులుతో, 115.97 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పోర్టును నిర్మించనున్నారు. తొలిదశలో భాగంగా 4 బెర్త్‌ల నిర్మాణానికి సీఎం శ్రీ వైయస్ జగన్ ఇటీవలే శంకుస్థాపన చేశారు.

ఇప్పటికే నార్త్ బ్రేక్ వాటర్ పాయింట్ నిర్మాణం పూర్తి కాగా, సౌత్ బ్రేక్ వాటర్ ప్లాంట్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. పోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అటు ప్రభుత్వం, ఇటు నిర్మాణ సంస్థ కృతనిశ్చయంతో ఉన్నాయి.

Advertisement
Advertisement