నటి ధన్సిక కర్రసాము

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ధన్సిక. తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో సైతం అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటి ప్రస్తుతం వాలుజడ అనే స్ట్రయిట్‌ తెలుగు సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ భామకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కబాలి సినిమాలో యాక్షన్‌ సీన్స్‌లో కనిపించిన ధన్సిక తాజాగా కర్రసాము చేస్తూ అలరించారు. ఈ వీడియోను ధన్సిక పర్సనల్‌ పీఆర్‌వో ప్రియా అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న ధన్సిక.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తున్నారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top