బిగ్‌బాస్ హౌస్‌లో కమల్ హాసన్!
బిగ్‌బాస్ సీజన్-2 రియాల్టీ షో రసవత్తరంగా సాగుతోంది. గురువారం ఎపిసోడ్లో ఇంటి సభ్యులు రచ్ఛ రంభోలా చేశారు. కెప్టెన్ టాస్క్‌లో భాగంగా జరిగిన డీజే టాస్క్‌లో చిందేసారు. అత్యంత ఆహ్లాదకరంగా.. ఆసక్తికరంగా సాగిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 50 ఎపిసోడ్స్‌లో ఇది ఓ బెస్ట్ ఎపిసోడ్ అని కూడా చెప్పొచ్చు.హౌస్‌లోకి నూతన నాయుడు, శ్యామల సైతం రీఎంట్రీ ఇచ్చారు. వీరి రాకతో హౌస్ మేట్స్ రెట్టించన ఉత్సాహం ప్రదర్శించారు. కెప్టెన్ పోటీదారులైన పూజా రామచంద్రన్, సామ్రాట్, రోల్‌రైడాలు డీజేలుగా వ్యవహరించగా.. వారికి మద్దతుగా ఇంటి సభ్యులు వారి ముందు డ్యాన్స్ చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు