‘సినిమా వాళ్లను చులకన చేసి మాట్లాడొద్దు’

సినిమా పరిశ్రమలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న సంఘటనలపై నటుడు కొణిదెల నాగబాబు ఘాటుగా స్పందించారు. కాస్టింగ్‌ కౌచ్‌పై తెలుగు సినిమా పరిశ్రమపై వస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)కు కొన్ని పరిమితులు ఉంటాయని అన్నారు. బుధవారం ఫిల్మ్‌ చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగబాబు మాట్లాడారు. ‘మా’ ఎవరికి అవకాశాలు ఇప్పించదని, కేవలం సభ్యుల సమస్యలను మాత్రమే పరిష్కరిస్తుందని చెప్పారు.

మా అసోసియేషన్‌లో సభ్యత్వ నమోదుపై జనరల్‌ బాడీ సమావేశంలో నిర్ణయం జరుగుతుందని వెల్లడించారు. ఉచితంగా మా సభ్యత్వం ఇవ్వరని తెలిపారు. ఈ విషయంలో మా అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీ రాజాను నిందించడం తప్పని అన్నారు. అవగాహన లేకుండా మా గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. నెల రోజుల నుంచి పరిశ్రమలో జరిగే సంఘటనలు గమనిస్తున్నానని, శ్రీరెడ్డి వ్యవహారం అసలు విషయం వదిలేసి పక్కదారి పట్టిందని చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top