రియల్‌ బ్యూటీ ఎంత గ్రేస్‌గా స్టెప్పులేశారో!

ఎంత పెద్ద కష్టం దాటితే అంత పెద్ద హీరోలవుతారు.. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు.. లక్ష్మీ అగర్వాల్‌ కూడా ఆ కోవకు చెందిన వారే. పద్నాలుగేళ్ల క్రితం యాసిడ్‌ దాడి రూపంలో ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూశాడో ఉన్మాది. అయితే.. పాపం ఆ మూర్ఖుడికి తెలియదు అతడి పాశవిక చర్య కేవలం లక్ష్మీ శరీరాన్ని మాత్రమే బాధించగలదని. యాసిడ్‌ దాడిలో ముఖం మెడ భాగం పూర్తిగా కాలిపోయినా.. మనోనిబ్బరంతో లక్ష్మీ తనకొచ్చిన ఆపద నుంచి బయటపడ్డారు. తనలాంటి బాధితులకు అండగా నిలిచి రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు. అందుకే బాలీవుడ్‌ స్టార్‌ భామ దీపికా పదుకొణె... లక్ష్మీ బయోపిక్‌ ‘చప్పాక్‌’ లో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలో లక్ష్మీ అగర్వాల్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌ మూవీ ‘భాగీ’ సినిమాలోని చమ్‌ చమ్‌ సాంగ్‌కు స్టెప్పులేసిన లక్ష్మీ.. ఆ వీడియోను ‘టిక్‌టాక్‌’లో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఫిదా అయిన నెటిజన్లు.. ‘రియల్‌ బ్యూటీ ఎంత గ్రేస్‌గా స్టెప్పులేశారో’ అంటూ ‘చప్పాక్‌ హీరో’ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా 2005లో ఓ 32 ఏళ్ల వ్యక్తి తనని పెళ్లి చేసుకోవాలంటూ లక్ష్మిని వేధించాడు. కానీ ఆమె అందుకు నిరాకరించడంతో యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. అనేక సర్జరీల అనంతరం కోలుకున్న లక్ష్మీ.. యాసిడ్‌ దాడి బాధితుల తరఫున పోరాడుతున్నారు. యాసిడ్‌ అమ్మకాలపై నిషేధం విధించడంతో తన వంతు పాత్ర పోషించారు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top