ఎన్టీఆర్‌ బయోపిక్‌ నుంచి తప్పుకున్న తేజ!

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి అందాల నటుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తండ్రి ఎన్టీఆర్‌ తరహాలో దుర్యోధనుడి వేషం ధరించిన సీన్లను షూటింగ్‌ ప్రారంభం సందర్భంగా తెరకెక్కించారు. అంతా సజావుగా జరుగుతుందనుకున్న సమయంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌కు సంబంధించిన సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి దర్శకుడు తేజ తప్పుకున్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తాను తెరకెక్కించడం లేదని ఆయన వెల్లడించారు.
 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top