చైతూ బర్త్‌డే: శేఖర్‌ కమ్ముల తన స్టైల్లో..

ఇక నాగచైతన్య బర్త్‌డే కానుకగా అతడు నటిస్తున్న తన 19వ చిత్ర పోస్టర్‌, వీడియో టీజర్‌ను మూవీ యూనిట్‌ తాజాగా విడుదల చేసింది. ఇంకా ఈ సినిమాకు టైటిల్‌ను ఫిక్స్‌ చేయలేదు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా చైతు బర్త్‌డే కానుకగా విడుదలైన టీజర్‌లో ఈ సినిమాలో అతడి క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో రివీల్‌ చేశారు. ఈ సినిమాలో మద్యతరగతి కుటుంబానికి చెందిన వాడిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ టీజర్‌ను నిశితంగా పరిశీలిస్తే శేఖర్‌ కమ్ముల టేకింగ్‌ విధానం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ క్లాస్‌ డైరెక్టర్‌ మార్క్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ దాస్‌ నారంగ్‌, పీ రామ్‌ మోహన్‌రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీహెచ్‌ పవన్‌ సంగీతమందిస్తున్నాడు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top