బిగ్‌బాస్‌ సీజన్‌ 2 టీజర్‌ విడుదల చేసిన కమల్

బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో గతేడాది ప్రసారమై విశేష ఆదరణ పొందింది. విశ్వనటుడు కమలహాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించడం పెద్ద ఎసెట్‌ అయ్యింది. అంతే కాదు నటి ఓవియ, జూలి, నటుడు ఆరవ్‌ బాగా ప్రాచుర్యం పొందారు. వారందరికీ ఇప్పుడు సినిమా అవకాశాలు వరిస్తున్నాయి. బిగ్‌బాస్‌ సీజన్‌– 2కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షోకు నటుడు కమలహాసనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌లో ఆయన పాల్గొనగా ఈ నెల 3న స్థానిక ఏవీఎం స్టూడియోలో చిత్రీకరించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top