బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌

‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టాస్క్‌ రక్తపాతాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌లో అలీ రెజా, హిమజ మధ్య జరిగిన గొడవ కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంలో తలదూర్చిన తమన్నాపై కూడా అలీ రెజా విరుచుకుపడ్డాడు. ఈ టాస్క్‌ పెట్టిన చిచ్చు అంత తొందరగా చల్లారలేదు. చివరకు హిమజ.. అలీ రెజా కాళ్లు పట్టుకుని ఏడ్చే వరకు వెళ్లింది. తన నుంచి సారీ మాత్రమే ఆశించానని, కాళ్లు పట్టుకోమని అడగలేదని అలీ రెజా వివరించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ గొడవలో హిమజ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కొడతాను అని బెదిరించినట్లు పదేపదే వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇదే వ్యవహారాన్ని వీకెండ్‌లో నాగ్‌ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top