భారత్ వృద్ధి అంచనాలకు ఫిచ్ కోత
భారత్ ఆర్థికాభివృద్ధికి (జీడీపీ) సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18 ఏప్రిల్, మార్చి) అంచనాల్లో కోత వేయటం కొనసాగుతూనే ఉంది. తాజాగా అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ వృద్ధి రేటును 6.7 శాతానికి తగ్గించింది. ఇంతక్రితంఅంచనా 6.9 శాతం. దేశంలో ఆర్థిక రికవరీ బాగున్నా... ఊహించినదానికన్నా నెమ్మదిగా ఉందని ఫిచ్ తన తాజా గ్లోబల్ ఎకనమిక్ ఔట్లుక్లో (జీఈఓ) పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి కూడా వృద్ధి రేటు అంచనాలను 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
క్రీడలు
వైరల్ వీడియోలు