పత్రికల్లో అలా రాయిస్తారా: ధర్మాన

ఏపీ సీఎం చంద్రబాబు తన వైఫల్యాలను అధికారులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తలను చట్టాలకు అతీతంగా చూడాలని అధికారులకు చంద్రబాబు చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బాబు తన పాలనను గాడి తప్పించేవిధంగా తీసుకెళ్తున్నారని గతంలోనే చెప్పామని, ఇప్పుడు అదే నిజమైందన్నారు. అన్ని వ్యవస్థలను దిగజార్చారని అన్నారు. జన్మభూమి అనే కిరికిరి కమిటీలు పెట్టి బాబు రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని ధర్మాన ధ్వజమెత్తారు. పెన్షన్లు కూడా ఇవ్వలేని దుస్థితికి కలెక్టర్లను దిగజార్చింది వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top