కనీస మద్దతు ధరలు కల్పించాలి: జెడ్పీ చైర్మన్ రామగోవిందర
అరటి, ఉల్లి, శనగ పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించాలని జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను వైఎస్సార్ కడప జిల్లాలోనే కొనసాగించాలని లేదా రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. వీటిని తీర్మానాలుగా ఆమోదించి ప్రభుత్వానికి పంపుతున్నట్లు ఆయన ప్రకటించారు. సభ్యులు లేవనెత్తే సమస్యలను అధికారులు రాసుకుని వాటి పరిష్కారం కోసం ఏయే చర్యలు తీసుకున్నారో వచ్చే సమావేశంలో చెప్పాలని ఆదేశించారు. జెడ్పీటీసీలు ఫోన్ చేసినా డీఎంఅండ్‌హెచ్‌ఓ నాగరాజు స్పందించకపోతే ఎలా? అంటూ నిలదీశారు.


