నేడు గుడి తిరునాల
కలసపాడు : మండల కేంద్రమైన కలసపాడులోని సగిలేరు ఒడ్డున ఉన్న పరిపేతురు పరిపౌలు చర్చి 138వ వార్షికోత్సవం మంగళ, బుధవారాల్లో నిర్వహిస్తున్నట్లు డీనరీ చైర్మన్ ఆనందకుమార్, ప్రెస్బేటర్ ఆశిస్‌గాబ్రియేల్ తెలిపారు. 2వ తేదీ మంగళవారం సాయంత్రం నంద్యాల బిషప్ రెవరెండ్ కామనూరి సంతోష్ ప్రసన్నరావు, ఆయన సతీమణి బ్యూలా సంతోష్ ఊరేగింపు ఉంటుందని, రాత్రి 6–30 గంటలకు క్రైస్తవ సంగీత విభావరి, 7 గంటలకు పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు, 8–30 గంటలకు దీపారాధన, 9–30 గంటలకు కానుకలు సమర్పించుట, రాత్రి 10 గంటలకు యువజనులచే సాంస్కృతిక కార్యక్రమాలు, 10–30 గంటలకు రవికుమార్ బృందం వారిచే చెక్కభజన, 11–30 గంటలకు గుణదలమాత నాట్య మండలి విజయవాడ వారిచే వి.దత్తుబాబు సమర్పించు యేసుకృప క్రైస్తవ నాటకం ఉంటుందన్నారు. 3వ తేదీన ఉదయం 4 గంటలకు మొదటి ఆరాధన ప్రభురాత్రి భోజన సంస్కారం, 7 గంటలకు గుడి ప్రదర్శన, 9 గంటలకు బాప్జిస్మములు, సాయంత్రం 4 గంటలకు ప్రతిష్ట పండుగ ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా మైదుకూరు డీఎస్పీ రాజేందప్రసాద్ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల సీఐ హేమసుందర్‌రావు, స్థానిక ఎస్‌ఐ తిమోతిలు 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. అలాగే వైద్యాధికారులు డాక్టర్ శైలజ, డాక్టర్ సాయితేజ ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఉంటుంది.


