కడప విమానాశ్రయానికి ఉడాన్ స్కీం నిధులు
● రూ.606 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు
● రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి
రాజంపేట : కడప విమానాశ్రయంలో 2024–2025 ఉడాన్ స్కీం కింద దాదాపు రూ.606 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి మురళీధర్ మోహల్ తను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశం సందర్భంగా రాజ్యసభలో కడప విమానాశ్రయం అభివృద్ధిపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు తీసుకొచ్చారు. కడప విమానశ్రయానికి కనెక్టివిటీ పెంచాలని కోరామన్నారు. ర ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు జీవనోపాధి కోసం లక్షలాది మంది వెళుతున్నారని, వారి సౌకర్యం కోసం గల్ఫ్ విమానాల రాకపోకలను తీసుకురావాలన్నా రు. కడప నుంచి చైన్నె, విజయవాడ, హైదరాబాదుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ ద్వారా కనెక్టివిటీ కొనసాగుతోందని తెలిపారన్నారు. కొత్తగా డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణం కొనసాగుతోందన్నారు. హైదరాబాదు, చైన్నె కనెక్టివిటీతో యుఏఈ, కువైట్ దేశాలకు రాకపోకలు కొనసాగించవచ్చని తెలిపారన్నారు.


