రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు వెంకటప్ప విద్యార్థి
పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణంలోని వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న కుందనశ్రీ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. గతనెల 22, 25 తేదీలలో తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన జిల్లా స్థాయి హాకీపోటీలలో కుందనశ్రీ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈనెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై న విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.


