జగన్ 2.0 పాలన కార్యకర్తలదే
● కష్ట కాలంలో పార్టీ అభ్యున్నతికి పాటుపడిన వారికే మేలు
● కడప నియోజకవర్గ అవగాహన సదస్సులో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి
సదస్సులో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, చిత్రంలో పార్టీ నేతలు.... హాజరైన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు
కడప కార్పొరేషన్ : రాబోయే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకే పెద్ద పీట ఉంటుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నగర శివార్లలోని పద్మప్రియ కళ్యాణ మండపంలో కడప నియోజకవర్గ, జోన్, డివిజన్ల కమిటీల నియామక అవగాహన సదస్సు నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ 2019 పాలనలో కార్యకర్తల అంచనాలను అందుకోలేకపోయామని, రాబోయే రోజుల్లో ఆ లోపాలను సరిదిద్దుకుంటామన్నా రు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రతిసారీ అధికారంలోకి వచ్చే పార్టీలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మన రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నిర్మా ణానికి శ్రీకారం చుట్టారన్నారు. అందుకే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించి, అన్ని కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. ఈ కమిటీల్లో నిఖార్సైన కార్యకర్తలకే చోటు కల్పించాలని సూచించారు. రాబోయే రోజుల్లో పదవుల్లో, పనుల్లో వారికే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 50కి 50 డివిజన్లు కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు
కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి అన్ని వర్గాల ప్రజలు దారుణంగా మోసపోయారని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు. రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించలేదని, పీఆర్‌సీ, డీఏలు ఇవ్వక ఉద్యోగులు, పింఛనర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి కార్యకర్త సుశిక్షితులై సైనికులుగా తయారు కావాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలను జగన్ గుండెల్లో పెట్టుకుంటారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటారని వైఎస్సార్‌సీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రభాస్కర్‌రెడ్డి అన్నారు. డిసెంబర్ 21 లోపు పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. కడపలో 47 డివిజన్లలో 109 యూనిట్లకు గాను 90వేలమందితో కమిటీలు నియమించాలన్నారు. కార్యకర్తల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలా నియమించిన కమిటీలు ప్రతినెల మూడో వారంలో సమావేశం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి మేయర్ ముంతాజ్ బేగం, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు మాసీమ బాబు, యానాదయ్య, సొహైల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాక సురేష్, ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, క్లస్టర్ అధ్యక్షులు బీహెచ్ ఇలియాస్, రామ్మోహన్‌రెడ్డి, ఐస్‌క్రీం రవి, నాగమల్లారెడ్డి, మాజీ కార్పొరేటర్ జమల్‌వలీ, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగన్ 2.0 పాలన కార్యకర్తలదే


