వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేయడమే మన జెండా..ఎజెండా
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎం చేయడమే మన జెండా, ఎజెండా కావాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష అన్నారు. ఏ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే పార్టీ కేడర్ పటిష్టంగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, అన్ని డివిజన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని, కడపలో అధికార పార్టీ నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులపై దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ సవాల్ విసిరారు. డిజిటల్ బుక్‌లో పేర్లు ఉన్నవారిని ఆ దేవుడు కూడా రక్షించలేడని హెచ్చరించారు. అంతకుముందు వారు దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


