విద్యా సంస్థల బస్సులపై కొరడా!
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: విద్యా సంస్థల బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో నిత్యం స్కూలు బస్సు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో విద్యా సంస్థల బస్సులను మరోమారు తనిఖీలు చేయాలని అధికారులు ఆదేశించడంతో రవాణా శాఖ అధికారులు నవంబర్ 28 నుంచి జిల్లాలో తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీలు ఈ నెల 4 వరకు చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బస్సులు దాదాపు 1091 ఉన్నాయి. రెండు రోజుల పాటు జరిగిన తనిఖీల్లో 90 విద్యా సంస్దల బస్సులను తనిఖీలు చేయ గా 26 బస్సులకు సరైన పరికరాలు, పత్రా లు లేకపోవడంతో వాటిని మరమ్మత్తులు చేయించుకొని తిరిగి రవాణా శాఖ అధికారుల ద్వారా తనిఖీలు చేయించుకోవాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటివరకు జిల్లాలో బద్వేలులో 9,కడపలో 30, పులివెందుల 9, ప్రొద్దుటూరు 42 బస్సులను తనిఖీ చేశారు.
పరిమితికి మించి విద్యార్థులను
తరలిస్తున్న విద్యా సంస్థల బస్సులు
జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థ బస్సులో సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది విద్యార్థులు తరలిస్తున్నారు. బస్సులో ఇద్దరు విద్యార్థులు కూర్చొనే సీటులో ముగ్గురు లేక నలుగురు విద్యా ర్థులను కూర్చోపెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టి ఉదయం, సాయంత్రం సమయాల్లో తనిఖీలు చేస్తే బాగుంటుదని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
డిసెంబర ్4 వరకు కొనసాగనున్న తనిఖీలు
ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఉంటేనే రోడ్డుపైకి బస్సు
ఇప్పటికే విద్యా సంస్థల బస్సులకు నోటీసుల ద్వారా సమాచారం
ఇప్పటివరకు 90 బస్సుల తనిఖీలు
ప్రతి విద్యా సంస్థ బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం
జిల్లాలో ఉన్న ప్రతి విద్యా సంస్థ బస్సును తాము కేటాయించిన తేదీకల్లా తనిఖీలు చేయించుకోవాలి. ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఖచ్చితంగా ఉండాలి. తనిఖీలు చేయించుకోవా లని ఇప్పటికే విద్యా సంస్థల యాజమాన్యాలకు సమాచారం ఇచ్చాం. ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. –వీర్రాజు,
జిల్లా ఉప రవాణా శాఖ ఇన్‌చార్జ్ కమిషనర్
ప్రతి విద్యా సంస్థ బస్సుకు స్పీడు గవర్నెన్స్ ఉండాలి
2019 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాహనానికి తప్పని పరిగా ఫైర్ అలారం ఉండాలి
2020 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన బస్సుకు డ్రైవర్ దగ్గర ఫైర్ పరికరాలు ఉండాలి
ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌లు ఉండాలి
వాహనానికి సంబంధించిన ట్యాక్స్, పర్మిట్, ఇన్స్యూరెన్స్ ఉండాలి
డ్రైవర్‌కు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి
విద్యార్థులను సీటింగ్ కెపాసిటీ ప్రకారం మాత్రమే కూర్చొబెట్టాలి
విద్యా సంస్థల బస్సులపై కొరడా!


