పంటల బీమాపై అవగాహన పెంచాలి
కడప కోటిరెడ్డిసర్కిల్: అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పంటల బీమాపై బ్యాంకర్లు, వ్యవసాయ శాఖాధికారులు జిల్లా రైతుల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రానాయక్ ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు. భారత ప్రభుత్వం 2025 డిసెంబర్ 1 నుంచి 7 వరకు 10వ పంట బీమా వారో త్సవాన్ని 2025–26 రబీ కోసం నెలరోజుల పాటు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింద న్నారు. దీని ప్రకారం, మన జిల్లాలో పంటల బీమాపై విస్తృతమైన అవగాహన నిర్వహించను న్నట్లు తెలిపారు. రబీలో 2025–26 సీజన్లో నువ్వుల పంటకు రూ.180, వేరుశనగకు రూ. 480, పెసలకు రూ.270, జొన్నలకు రూ.315, మినుములకు రూ.285, వరికి రూ.630, ప్రొద్దుతిరుగుడుకు రూ. 300, బుడ్డ శనగకి రూ.480 ఒక ఎకరానికి ప్రీమియం రైతులు చెల్లించవలసి ఉంటుందన్నారు. రైతులు వెంటనే పంటల బీమా కోసం నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: మైన్స్ సేఫ్టీ వీక్ అండ్ ప్రొడక్టివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40వ గనుల భద్రతా వారోత్సవాలు మేడా రఘునాథ్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డైరెక్టర్ ఆఫ్ మైండ్ సేఫ్టీ రఘుపతి పెద్దిరెడ్డి, కిషోర్‌కుమార్ డోకుపర్తి, ఎన్ మారుమూత్తు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ రవి కృష్ణ అయ్యర్, గ్రూప్ హెచ్‌ఆర్ హెడ్ రమేష్ వీపీ, హెచ్‌ఆర్ ఎల్.సోమశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో వివిధ విభాగాల్లో నిడిజీవి లైవ్ స్టోన్ మైన్స్, ది ఇండియా సిమెంట్ లిమిటెడ్ గనుల భద్రతా విషయంలో మొదటి బహుమతి గెలుచుకుంది.
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అనంతపురం గంగమ్మ ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తీకమాసం ముగిసిన నేపథ్యంలో భక్తులు గంగమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గంగమ్మా..కాపాడవమ్మా అని వేడుకున్నారు. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు.చుట్టుపక్కల వారే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
రాజంపేట: ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినట్లు డాక్టర్ బాలరాజు ఆదివారం ఇక్కడి విలేకర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసిబ్బంది, ఆసుపత్రుల రక్షణ చట్టాన్ని కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆసుపత్రుల అనుమతులకు ఏకగవాక్ష విధానం ఉండాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు ఐఎంఏ సహకరిస్తుందన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ అందిస్తున్న ఆసుపత్రుల బకాయి లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్, ప్రెసి డెంట్ ఎలక్ట్ డాక్టర్ పీఎస్ శర్మ, ప్రధానకార్యదర్శి సుభాష్ చంద్రబోస్, ఆర్ధిక కార్యదర్శి డాక్టర్ తుమ్మల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
పంటల బీమాపై అవగాహన పెంచాలి
పంటల బీమాపై అవగాహన పెంచాలి


