బాబు సర్కారు నిర్లక్ష్యం.. సీమకు శాపం
కడప రూరల్: పాలకుల నిర్లక్ష్యం రాయలసీమ అభివృద్ధికి శాపంగా మారిందని.. కూటమి పాలకులు ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడం చారిత్రాత్మక తప్పిదమని వక్తలు మండిపడ్డారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆర్‌ఎస్‌ఎఫ్ (రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం) ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేశు యాదవ్ అధ్యక్షతన రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తార్, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.రామ్మోహన్, ఎన్.వెంకట శివ, బీసీ సంఘం నాయకులు అవ్వారు మల్లికార్జున మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధిపై చర్యలు చేపట్టాలన్నా రు. ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు, ప్రాజెక్టుల ఏర్పాటుతోనే రాయలసీమ రతనాల సీమగా మారుతుందన్నారు. కూటమి పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం ఎంతమాత్రం తగదన్నారు. ప్రధానంగా ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడం చారిత్రాత్మక తప్పిదమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచిత మెడికల్ విద్య మిథ్యగానే మిగిలిపోతుందన్నారు. తక్షణమే ఈ విధానాన్ని టీడీపీ కూటమి పాలకులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఓబులేసు యాదవ్ మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమ హామీలకే పరిమితమైందన్నారు. అలాగే కడప–బెంగుళూరు రైల్వేలైన్ మధ్యలోనే ఆగిపోయిందన్నారు. ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలకులు రాయలసీమ ప్రాంత అభివృద్దిపై చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాల ద్వారా రాయలసీమ హక్కులను సాధించుకుంటామన్నారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సగిలి గుర్రప్ప, సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి ఓబయ్య, గ్రేటర్ రాయలసీమ అభివృద్ది వేదిక కన్వీనర్ కారు ఆంజనేయులు, సృజన సామాజిక వేదిక నాయకులు శ్రీనివాసులు, మహాజన రాజ్యం పార్టీ అధ్యక్షులు సంగటి మనోహర్, ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ ఫోరం అధ్యక్షులు జేవీ రమణ, ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిఽధి లెక్కల జోగిరామిరెడ్డి, ఆర్‌ఎస్‌ఎఫ్ మాజీ కన్వీనర్ మల్లెల భాస్కర్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, సీఆర్‌వీ ప్రసాద్, షేక్ దస్తగిరి, దేవర శ్రీకృష్ణ పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడం తగదు
సీమ అభివృద్ధిని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు


