డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్‌లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–14 రెండో విడత జోనల్ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. రెండో రోజు సెంట్రల్ జోన్ విన్నర్స్–రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. శనివారం 19 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టు 82 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 352 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని పీవీఎస్‌ఆర్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 187 బంతుల్లో 23 ఫోర్లు, 1 సిక్సర్‌తో 193 పరుగులు చేశాడు. తులసిరామ్ 59 పరుగులు చేశాడు. సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టులోని యాధేష్ 2, సీహెచ్ జైవర్దన్‌నాథ్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యత సాధించింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్–నార్త్ జోన్ విన్నర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో రోజు 12 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ జోన్ విన్నర్స్ జట్టు 90 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని కేపీ శ్రీరామ్ 105, సాయి అర్జున్ 53, రియాన్స్ సాయి 44 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ జట్టులోని శ్రీచరణ్ 2, రోహిత్ 2 వికెట్లు తీశారు. అంతకు ముందు రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో నార్త్ జోన్ విన్నర్స్ జట్టు 100 పరుగులు ఆధిక్యత సాధించింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో సౌత్‌జోన్ విన్నర్స్–రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 176 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టు 64.1 ఓవర్లకు 295 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని నందన్ కృష్ణ సాయి 55, యోజిత్ 44 పరుగులు చేశారు. సౌత్‌జోన్ విన్నర్స్ జట్టులోని రక్షన్ సాయి అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు తీశాడు. తరుణ్‌కుమార్‌రెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్‌జోన్ విన్నర్స్ జట్టు 62 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రణవ్ గోవర్దన్ 57, త్రివిక్రమ్‌రెడ్డి 38 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టులోని దీక్షిత్ 3, యోజిత్ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్ జట్టు 1 ఓవర్‌కు వికెట్లు కోల్పోకుండా 13 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.
పీవీఎస్‌ఆర్ వర్మ, 193 పరుగులు
ప్రణవ్ శ్రీరామ్, 105 పరుగులు
రక్షన్ సాయి,
6 వికెట్లు
డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్‌లు
డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్‌లు


