విశేషంగా తరలివస్తున్న కార్యకర్తలు
వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యుడు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానిదే అన్నారు. నేడు రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చులు రేపుతూ వివక్ష పూరితమైన పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పైన విశేషమైన ప్రేమాభిమానంతోనే కార్యకర్తలు.. అధికారంలో లేకపోయినా పార్టీ కార్యక్రమాలకు తరలివస్తున్నారని అన్నారు. నాడు రెండేళ్లు కరోనాతో సమయం వృథా అయిందని, మిగిలిన మూడేళ్ల పరిపాలనలోనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశారన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేయబోయే గ్రామ, వార్డు కమిటీల సభ్యుల ఆమోదం మేరకే రాబోయే ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు, పరిపాలన అమలు చేయనున్నట్లు తెలిపారు.


