కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యం
చింతకొమ్మదిన్నె : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల ఆశయాల సాధనకే రాబోయే జగనన్న ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం చింతకొమ్మదిన్నె సమీపంలోని రాజారాణి కల్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో కమలాపురం నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ వార్డులు, మండలాల గ్రామ కమిటీల ఏర్పాటుకు సన్నాహక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా అత్యంత పటిష్టంగా బలోపేతం చేసేందుకు గ్రామ, వార్డు స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీల ఏర్పాటు తర్వాత సంబంధిత సభ్యులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ఐడీ కార్డులు పార్టీ మంజూరు చేస్తుందన్నారు. సుశిక్షితులైన కార్యకర్తలు కమిటీలలో చేరి నాయకులుగా మారడం ద్వారా.. కమిటీలలోని సభ్యులకు భవిష్యత్తులో అన్ని విధాలా ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. అన్ని వర్గాల వారిని సంబంధిత కమిటీలలోకి చేర్చి పార్టీని పటిష్టంగా మార్చాలని నాయకులను కోరారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోని వివిధ రాజకీయ పార్టీల సంస్థాగత వ్యవహారాలపై పూర్తిగా అధ్యయనం చేసి, పార్టీ కార్యకర్తల ఆశయ సాధన కోసం అధికారంలోకి రావడానికి.. చురుకై న కార్యకర్తలే కారణమని భావించి, పార్టీని పటిష్టంగా నిర్మించడానికి మండల, గ్రామ వార్డుల కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అధికారంలోకి రావడానికి దోహదం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి గ్రామ, మండల వార్డు కమిటీల ఏర్పాటు దోహదం చేస్తుందని తెలిపారు. కమిటీలలో విశ్వాసపాత్రులైన కార్యకర్తలు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులను మాత్రమే నియమించాలని నాయకులకు తెలియజేశారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీగా సంతకాలు
వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం, బద్వేలు పరిశీలకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగాా కమలాపురం నియోజకవర్గ శ్రేణులు 20 వేల సంతకాలు సేకరణ చేశారని, అభినందనలు తెలిపి నమస్కరించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి ఎటువంటి తారతమ్యం లేకుండా అమలు పరిచి ప్రజాభిమానం పొందినందున, ఈరోజు ఎక్కడ పర్యటించినా లక్షలాది మంది ప్రజలు పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా తరలివస్తున్నారన్నారు. అనంతరం వీరపునాయునిపల్లి, వల్లూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి చెన్నూరు, కమలాపురం మండలాలు, కమలాపురం మున్సిపాలిటీకి సంబంధించిన కార్యకర్తలకు కమిటీల నియామకంపై నాయకులు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ సంయుక్త కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, కమలాపురం నియోజకవర్గంలోని మండలాల కన్వీనర్లు వీరారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రఘునాథరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఉత్తమారెడ్డి, రమణారెడ్డి, పార్టీ వివిధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
రవీంద్రనాథ్‌రెడ్డి
గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటు
సన్నాహక సమావేశం
భారీగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు
కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యం


