ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు

Nov 29 2025 7:37 AM | Updated on Nov 29 2025 7:37 AM

ప్రార

ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ అండర్‌–14 రెండో విడత జోనల్‌ మ్యాచ్‌లు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. తొలి రోజు కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సౌత్‌జోన్‌ విన్నర్స్‌–రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌జోన్‌ జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్‌ గెలిచిన సౌత్‌జోన్‌ విన్నర్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 48.2 ఓవర్లకు 123 పరుగులకు ఆలౌట్‌ అయింది. ప్రణవ్‌ గోవర్దన్‌ 48, కేవీఎస్‌ మణిదీప్‌ 14 పరుగులు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌జోన్‌ జట్టులోని పి.దీక్షిత్‌ 3, సాత్విక్‌ 3, యోజిత్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌జోన్‌ జట్టు 41 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ప్రజ్ఞాన్‌ పండిత్‌ 39, విఘ్నేష్‌ 34 పరుగులు చేశారు. సౌత్‌జోన్‌ విన్నర్స్‌ జట్టులోని రక్షన్‌ సాయి 2, తరుణ్‌కుమార్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌జోన్‌ జట్టు 53 పరుగుల అధిక్యంలో ఉంది.

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో ..

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సెంట్రల్‌ జోన్‌ విన్నర్స్‌, రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్‌ గెలిచిన సెంట్రల్‌ జోన్‌ విన్నర్స్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంట్రల్‌ జోన్‌ విన్నర్స్‌ జట్టు 79.3 ఓవర్లకు 235 పరుగులకు ఆలౌట్‌ అయింది. యాసిన్‌ సిద్దిఖ్‌ 91, రితిష్‌ 49 పరుగులు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ జట్టులోని యూనైస్‌ 4, సర్దార్‌ సమీర్‌ 2, తులసి రామ్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ జట్టు 8 ఓవర్లకు 19 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌జోన్‌, రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌జోన్‌ జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్‌ గెలిచిన రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌ జోన్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 80.1 ఓవర్లకు 206 పరుగులకు ఆలౌట్‌ అయింది. సాయి కృష్ణ చైతన్య 41, యశ్వంత్‌ సూర్యతేజ్‌ 37 పరుగులు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌ జోన్‌ జట్టులోని చాణ్యి పాయి 3, షణ్మఖ గణేష్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌ జోన్‌ జట్టు 9 ఓవర్లకు తొలి వికెట్‌ కోల్పోయి 12 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.

యాసిన్‌ సిద్దిఖ్‌, సెంట్రల్‌ జోన్‌ విన్నర్స్‌ (91 పరుగులు)

యూనైస్‌, రెస్ట్‌ ఆఫ్‌

సెంట్రల్‌ జోన్‌ (4 వికెట్లు)

ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు1
1/1

ప్రారంభమైన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement