ఉత్సాహంగా విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు
విజేతలకు సర్టిఫికెట్లను అందజేస్తున్న డీఎస్‌డీఓ గౌస్ బాషా, కోచ్‌లు
పరుగు పందెంలో విభిన్న ప్రతిభావంతులు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : నగరంలోని డీఎస్‌ఏ క్రీడా మైదానంలో 66వ విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల)దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. డీఎస్‌డీఓ గౌస్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు దాదాపు 100 మంది విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు. వీరికి బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, చెస్, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారు డిసెంబర్ 1, 2 తేదీల్లో గుంటూరులోని డీఎస్‌ఏ క్రీడా మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి విభిన్న టీజీ అండ్ సీనియర్ సిటిజన్ సంక్షేమాధికారి ఆర్‌వీ కృష్ణ కిషోర్, పారా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి దామోదర్‌రెడ్డి, ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ సూర్యప్రకాశ్ బహుమతులను అందజేశారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికై న బ్యాడ్మింటన్ జట్టు..
ఎం.మనోహర్ రాజ్, డి.తిరుమల్లేష్, కె.మల్లికార్జున, సాయిచరణ్, ప్రణీత్ రెడ్డి, పి.చెన్నకేశవ, బి.దివ్య ప్రసాద్, కె.సుబ్బరాయుడు, వై.వెంకట సుభాష్, పి.ఓబులేసు, ఎస్.షాకీర్ హుస్సేన్
ఉత్సాహంగా విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు


