తారుప్లాంటు ధ్వంసం
ముద్దనూరు : ముద్దనూరు–పులివెందుల రహదారిలో పెద్ద దుద్యాల గ్రామ సమీపంలో వున్న తారుప్లాంటు (హట్‌మిక్స్ ప్లాంట్)ను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం ధ్వంసం చేశారు. తారు ప్లాంటులో వున్న సీసీ కెమరాలు, క్యాబిన్‌తో పాటు తారుప్లాంటుకు చెందిన ఇతర సామగ్రిని దుండగులు ధ్వంసం చేశారు. రాత్రి పొద్దుపోయాక ప్లాంటులోని కొంత సామగ్రికి నిప్పు పెట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో సుమారు రూ.70 లక్షల మేర నష్టం జరిగిందని ప్లాంటు యాజమాన్యం తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్లాంటు సూపర్‌వైజర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు.
ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
పులివెందుల రూరల్ : ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక సబ్ జైలు, లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జైలులోని రిజిస్టర్లను పరిశీలించి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యతను వివరించారు. ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పులివెందుల సబ్‌జైలు సూపరింటెండెంట్, ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, ఖైదీలు పాల్గొన్నారు.
తారుప్లాంటు ధ్వంసం


