నాయకుడంటే.. ఓ భరోసా నాయకుడంటే... ఓ ధైర్యం నాయకుడిని చూస
జన ప్రభంజనం..
జననేతకు గజమాలతో సత్కారం
సాక్షి కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రెండో రోజు పర్యటన ఆద్యంతం జనసందోహం నడుమ సాగింది. పర్యటనలో భాగంగా అరటి తోటలను పరిశీలించారు. రైతుల దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతులకు అండగా నిలిచారు. గిట్టుబాటు ధర కల్పించని చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. అలాగే పలువురు నేతలు, కార్యకర్తలను పరామర్శించారు. వధూవరులను ఆశీర్వదించారు. తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు.
కోల్డ్ స్టోరేజ్‌ను అందుబాటులోకి
తీసుకురాకపోవడంపై ఆగ్రహం
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లె సమీపంలోని రైతులు ఇల్లూరు శ్రీనివాసులరెడ్డి, ఇల్లూరు రామతులశమ్మ అరటి తోటను మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ ఇన్‌ఛార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి ఉన్నారు. గిట్టుబాటు ధరల్లేక ..అడిగేనాథుడు కానరాక చెట్లమీదనే మాగిపోతున్న అరటి గెలలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ జిల్లా రైతు నాయకుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డితోపాటు బ్రాహ్మణపల్లె కౌన్సిలర్ మహేశ్వరరెడ్డి, రైతు శ్రీనివాసులరెడ్డి రైతుల దుస్థితిని వివరించారు. అరటిలో దిగుబడి ఉన్నా.. ధరలేదని, కేవలం టన్ను రూ.2వేలకు అడుగుతున్నారని వివరించారు. అది కూడా ప్రస్తుతం కొను గోలు చేసేవారేలేరని.. వ్యాపారులు తోటల వద్దకు రాకపోవడంతో కాయలు చెట్ల మీదనే మాగిపోతున్నాయని తెలిపారు. రైతుల దుస్థితి విని వైఎస్ జగన్ చలించిపోయారు. గిట్టుబాటు ధర కల్పించకుండా అన్యాయం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. వైఎస్సార్‌సీపీ హయాంలో గిట్టుబాటు ధరతోపాటు ధరల స్థిరీకరణ నిధి, పెట్టుబడి సాయం, ఉచిత పంటల భీమా, పంట నష్టపోయిన సందర్భంగా ఇన్‌ఫుట్ సబ్సిడీ ఎప్పటికప్పుడు అందిస్తూ వ్యవసాయాన్ని ఒక పండుగలా సాగిందని పేర్కొన్నారు. 2024 మార్చిలో బనానా కోల్డ్ స్టోరేజ్‌ను ప్రారంభించానని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ కరెంటు ఛార్జీలకు భయపడి వినియోగంలోకి తీసుకురావడంపై మండిపడ్డారు.
వధూవరులకు ఆశీర్వాదం: పట్టణంలోని స్థానిక వాసవీ కళ్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, బలిజ సంఘం సభ్యులు కొంగనపల్లె మురళీ, సుభద్ర దంపతుల కుమారుడి వివాహానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులు సాయి కిరణ్, వినీతను ఆశీర్వదించారు.
మహేశ్వరరెడ్డి కుటుంబానికి పరామర్శ
లింగాల మండల మాజీ సర్పంచ్ మహేశ్వరరెడ్డి ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. ఈ నేపథ్యంలో బుధవారం గోపి విహార్ వీధిలోని వారి ఇంటికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.తొలుత మహేశ్వర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమవుతున్న మహేశ్వరరెడ్డి భార్య నాగేశ్వరమ్మను ఓదార్చారు. పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం సమీపంలోనే ఉన్న లింగాల మండల మాజీ ఉపాధ్యక్షుడు లోపట్నూతల వెంగల్‌రెడ్డి ఇంటికి వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
వేల్పుల రామును పరామర్శించిన మాజీ సీఎం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం వేల్పులలో వేముల మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి(వేల్పుల రాము)ని పరామర్శించారు. ఇటీవల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మూకలు వేల్పుల రాముపై దాడి చేసి తీవ్రంగా గాయపరచగా... ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. రాముతోపాటు ఆయన తల్లి, వేల్పుల మాజీ సర్పంచ్ లింగాల పార్వతమ్మ, సతీమణి, వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లింగాల ఉషారాణిలతో కూడా వైఎస్ జగన్ మాట్లాడారు.
జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాం..
వేల్పుల నుంచి వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బెస్తవారిపల్లె వద్ద పలువురు హాస్టల్ ఉద్యోగులు కలిశారు. కొన్ని నెలలుగా తమకు జీతాలు రావడం లేదని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. అనంతరం వైఎస్ జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. రోటరీపురానికి చెందిన బికారి అనే మహిళ తనకు పింఛన్ రాలేదని .. ఇబ్బందులు పడుతున్నానని వాపోయారు.
క్యాంపు కార్యాలయం వద్ద జనసందోహం
పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెండవ రోజు బిజీబిజీగా గడిపారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం వైఎస్ జగన్ ప్రజలతో మమేకమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వైఎస్ జగన్‌కు తమ సమస్యలు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దురాగతాలను వివరించారు.
వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం పలువురు నేతలు కలిశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గోవిందరెడ్డి, ఎస్‌ఈసీ మెంబర్ సాయినాథ శర్మ, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల నాయకులు బలరామిరెడ్డి, వరప్రసాద్, చిన్నప్ప, వీర ప్రతాప్‌రెడ్డి, సాంబశివారెడ్డి, బయపురెడ్డి, అంబకపల్లె బాబురెడ్డి, మర కా శివకృష్ణారెడ్డి, సైదాపురం చంటి, సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, రఘునాథరెడ్డి, రిషికేశవ తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.
మహేశ్వర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్
వైఎస్సార్ సీపీ నాయకుడు వేల్పుల రాము నివాసంలో ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్, చిత్రంలో ఎంపీ అవినాష్ రెడ్డి
పులివెందుల నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెస్తవారిపల్లెకు చేరుకోగానే జన ప్రభంజనం మొదలైంది. వైఎస్సార్‌సీపీ వేము ల మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డిని పరామర్శించేందుకు వెళుతున్న వైఎస్ జగన్‌కు బెస్తవారిపల్లె నుంచే పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. పార్టీ శ్రేణులు, యువకులు బైకులతో ర్యాలీ నిర్వహించారు. అడుగడుగనా పూల వర్షం కురిపిస్తూ.. బాణా సంచా పేల్చుతూ హారతులు పట్టారు. అడుగడుగునా వైఎస్ జగన్‌పై పూలవర్షం కురిపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వారందరినీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వ తీరుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు
క్యాంపు కార్యాలయంలో వినతుల స్వీకరణ
జననేత పర్యటనకుబ్రహ్మరథం పట్టిన జనం
నాయకుడంటే.. ఓ భరోసా నాయకుడంటే... ఓ ధైర్యం నాయకుడిని చూస
నాయకుడంటే.. ఓ భరోసా నాయకుడంటే... ఓ ధైర్యం నాయకుడిని చూస
నాయకుడంటే.. ఓ భరోసా నాయకుడంటే... ఓ ధైర్యం నాయకుడిని చూస
నాయకుడంటే.. ఓ భరోసా నాయకుడంటే... ఓ ధైర్యం నాయకుడిని చూస
నాయకుడంటే.. ఓ భరోసా నాయకుడంటే... ఓ ధైర్యం నాయకుడిని చూస


