అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
పులివెందుల: భారత రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా పులివెందులలోని తన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్ రెడ్డిలు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ ను స్మరించుకోవడం గొప్పగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ ఎస్సీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, పార్లపల్లి కిశోర్, కోళ్ల భాస్కర్, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


