ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించాలి
కడప అగ్రికల్చర్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు అధునిక వ్యవసాయ పద్దతులను పాటించి అధిక దిగుబడులను సాధించాలని కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ అంకయ్యకుమార్ సూచించారు. కడప మండలంలోని పాలెంపల్లె, ఉక్కాయిపల్లె,నానాపల్లె గ్రామాలలో బుధవారం రైతన్న మీకోసం కార్యక్రమం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కడప అర్బన్: భారత రాజ్యాంగ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని అన్నారు. ‘రాజ్యాంగ దినోత్సవం, న్యాయ దినోత్సవం సందర్భంగా బుధవారం కడపలోని జిల్లా కోర్టులో న్యాయసేవాసదన్‌లో రాజ్యాంగదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగాన్ని గౌర విస్తామని న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి ఇన్‌చార్జి ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.ప్రవీణ్ కు మార్, కడప గౌరవ నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి జి.దీనబాబు తదితరులు పాల్గొన్నారు.


