ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 71 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, మహిళా పి.ఎస్ డీఎస్పీ ఇ.బాలస్వామి రెడ్డి, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్


