కిడ్నాప్‌ కేసులో బంగారు వ్యాపారులు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కేసులో బంగారు వ్యాపారులు అరెస్టు

Nov 25 2025 9:18 AM | Updated on Nov 25 2025 9:18 AM

కిడ్న

కిడ్నాప్‌ కేసులో బంగారు వ్యాపారులు అరెస్టు

ప్రొద్దుటూరు క్రైం : హైదరాబాద్‌కు చెందిన హేమంత్‌శర్మను కిడ్నాప్‌ చేసి, బెదిరించిన కేసులో ప్రొద్దుటూరుకు చెందిన తనికంటి జ్యూవెలర్స్‌ నిర్వాహకులు తనికంటి శ్రీనివాసులు, తనికంటి వెంకటస్వామిని వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హేమంత్‌శర్మ 2018లో తనికంటి శ్రీనివాసులుకు 10 కేజీల బంగారం ఆభరణాలు ఇచ్చాడు. 2021లో డబ్బులు ఇస్తామని హేమంత్‌శర్మను ప్రొద్దుటూరుకు పిలిపించారు. కొర్రపాడు రోడ్డులోని పాలిటెక్నిక్‌ కాలేజి వద్ద హేమంత్‌శర్మ, అతని సోదరుడు నిఖిల్‌శర్మ ఉండగా తనికంటి శ్రీనివాసులు తన అనుచరులతో వచ్చి వారిని కిడ్నాప్‌ చేసి కారులో తీసుకెళ్లాడు. ఓ గదిలో బంధించి దాడి చేయడంతో పాటు వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లను బలవంతంగా తీసుకున్నాడు. ఈ ఘటనపై ఈ నెల 20న త్రీ టౌన్‌ పోలీసులు దాడి, కిడ్నాప్‌, దోపిడి, చంపుతామని బెదిరింపు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వన్‌టౌన్‌ పోలీసులు సోమవారం శ్రీనివాసులు, వెంకటస్వామిలను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసుకు సంబంధించిన వివరాలతో పాటు తనను పోలీసులు కొట్టినట్లు వెంకటస్వామి న్యాయమూర్తికి చెప్పినట్టు తెలిసింది. దీంతో న్యాయమూర్తి అతనికి తిరిగి వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రికి అతన్ని తీసుకెళ్లారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జమ్మలమడుగు రూరల్‌ : ద్విచక్రవాహనదారుడిని ఇన్నోవా వాహనం ఢీ కొన్న సంఘటనలో ఆవుల బాలయ్య (56) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు మండల పరిధిలోని దానవులపాడు గ్రామానికి చెందిన ఆవుల బాలయ్య సొంత పనుల నిమిత్తం గ్రామం నుంచి బైక్‌లో ప్రధాన రహదారిపైకి వచ్చి రోడ్డు దాటుతుండగా ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న ఇన్నోవా కారు ఢీకొంది. ఈ సంఘటనలో ఆవుల బాలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

కాలంతోపాటు పంటలు మారాలి

మైదుకూరు : మారుతున్న కాలంతోపాటు రైతులు సాగు చేసే పంటలు కూడా మారాలని జిల్లా వ్యవసాయాధికారి బి.చంద్రానాయక్‌ అన్నారు. సోమవారం మండలంలోని అన్నలూరులో రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతును రాజును చేసేందుకు 5 విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. అందులో నీటి భద్రత కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకు సాధ్యమైనంత వరకు సాగునీటిని అందించాలని యోచిస్తోందన్నారు. డిమాండ్‌ ఆధారిత పంటల కింద మారుతున్న కాలానికి అనుగుణంగా డిమాండ్‌ ఉన్న చిరుధాన్యాలను సాగు చేసేలా చూస్తుందని పేర్కొన్నారు. అగ్రిటెక్‌ కింద ప్రతి రైతుకు సాంకేతికతను అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు ఏపీ ఫార్మర్‌ రిజిస్ట్రీ పథకంలో భాగంగా యూనిక్‌ ఐడీలను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో మైదుకూరు ఏడీఏ ఎం.కృష్ణమూర్తి, ఏఓ బాలగంగాధర్‌రెడ్డి, తహసీల్దార్‌ రాజసింహ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

బంగారు నగలు చోరీ

సుండుపల్లె : మండల పరిధిలోని రెడ్డివారిపల్లెలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఇంటిలో చోరీ జరిగింది. బాధితుని వివరాల మేరకు.. రెడ్డివారిపల్లెలో నివాసం ఉండే సురేష్‌, సుధారాణి దంపతులు ఇంట్లో లేని సమయంలో ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు పగలకొట్టి బీరువాలోని 25 గ్రాముల బంగారం, రూ.80 వేల నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కిడ్నాప్‌ కేసులో బంగారు వ్యాపారులు అరెస్టు
1
1/1

కిడ్నాప్‌ కేసులో బంగారు వ్యాపారులు అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement