ముగిసిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు
పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణంలోని వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 16వ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ అండర్–14 పోటీలు ముగిశాయి. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో కడప బాలుర జట్టు, తూర్పు గోదావరి జట్లు తలపడగా కడప జట్టు విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో కడప బాలికల జట్టు తూర్పు గోదావరి జట్టుపై విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. విజేతలుగా నిలిచిన జట్లకు డీఎస్‌డీఓ గౌస్ బాషా, ఎంఈఓలు రామానాయుడు, రామచంద్రారెడ్డిలు, టోర్నమెంట్ పరిశీలకుడు రామకృష్ణ తదితరులు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం జాతీయ స్థాయిలో జరిగే సాఫ్ట్‌బాల్ జిల్లా బాలుర, బాలికల జట్లను ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ గేమ్స్ సెక్రటరీ శ్రీకాంత్‌రెడ్డి, రిటైర్డ్ సీనియర్ పీఈటీ విజయ ప్రసాద్ రెడ్డి, మానవతా సంస్థ చైర్మన్ కొండారెడ్డి, కడప జిల్లా కార్యదర్శి విక్టర్, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి అండర్–14
సాఫ్ట్‌బాల్ బాలుర జిల్లా జట్టు..
జాతీయస్థాయి అండర్–14 సాఫ్ట్‌బాల్ బాలుర జిల్లా జట్టుకు కడపకు చెందిన ఎ.మనోజ్, యు.సుబ్రమణ్యం, ఓ.రాజకుళ్లాయప్ప, సి.శ్రీశాంత్‌కుమార్, విజయనగరానికి చెందిన వి.వసంత్, కె.నిఖిల్, తూర్పుగోదావరికి చెందిన బాల ఎంవీవీ బాల ఆదిత్య, జీఎస్ నిశాంత్, కె.కసువర్మ, జయకృష్ణ, శ్రీకాకుళంకు చెందిన కె.దిలిశ్వరరావు, అనంతపురానికి చెందిన చి.చేతన్, విశాఖపట్టణానికి చెందిన ప్రతీక్ కుమార్, గుంటూరుకు చెందిన ఎం.కార్తీక్, చిత్తూరుకు చెందిన కె.బాల స్వరూప్, పశ్చిమగోదావరికి చెందిన పూర్ణనంద, స్టాండ్ బైలుగా విశాఖపట్టణానికి చెందిన బి.లోకేష్, కడపకు చెందిన ఎస్.ఇషాన్, విజయనగరానికి చెందిన జి.దుర్గాప్రసాద్, గుంటూరుకు చెందిన పి.నరేంద్రలు ఎంపికయ్యారు.
జాతీయస్థాయి అండర్–14
సాఫ్ట్‌బాల్ బాలికల జిల్లా జట్టు..
జాతీయస్థాయి అండర్–14 సాఫ్ట్‌బాల్ బాలికల జిల్లా జట్టుకు కడపకు చెందిన అనూష, ఉష, రెడ్డి గీత, హేమశ్రీ, తనూజ, తూర్పుగోదావరికి చెందిన పి.కృష్ణదీపిక, ఎం.ఝాన్సీ రాణి, సీహెచ్ రమ్యశ్రీ, ప్రకాశంకు చెందిన భాగ్యశ్రీ, హరిప్రియ, అనంతపురానికి చెందిన బి.మధులిక, ఈ.కీర్తన, గుంటూరుకు చెందిన ఎస్.కె.మస్తాని, విజయనగరానికి చెందిన యు.దీపిక, కృష్ణా జిల్లాకు చెందిన ఎస్.ఉస్మిత, కర్నూలుకు చెందిన అలేఖ్య, స్టాండ్ బైలుగా కడపకు చెందిన ఎన్.లిఖిత్‌శ్రీ, తూర్పుగోదావరికి చెందిన డి.సంగీత, అనంతపురానికి చెందిన వి.మైథిలీ ఎంపికయ్యారు.
టోర్నీ విజేతలుగా కడప బాలుర, బాలికల జట్లు


