మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు కోల్పోయే ప్రమా
కడప కోటిరెడ్డిసర్కిల్ : మధుమేహ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని, అశ్రద్ధ చేస్తే డయాబెటిక్ రెటినోపతి కారణంగా కంటి చూపును కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని కడప ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల, రాజశేఖర్ రెడ్డి ప్రాంగణం వైద్యులు, విట్రియో రెటినల్ సర్వీసెస్ అసోసియేట్ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ మనోజ్ శెట్టిగర్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ భారతదేశం 17 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులను కలిగి ప్రపంచ మధుమేహ రాజధానిగా పిలువబడుతోందన్నారు. 2045 నాటికి భారతదేశంలో 125 మిలియన్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటారని కొన్ని నివేదికలు చెబుతున్నాయన్నారు. ఈ వ్యాధి నేత్ర సమస్యలను పెంచుతుందని ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతికి గురవుతారన్నారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 191 మిలియన్ల ప్రజలు డయాబెటిక్ రెటినోపతితో బాధపడతారనే అంచనాలు ఉన్నాయని వివరించారు. డయాబెటిక్ రెటినోపతి ముందస్తు గుర్తింపు లక్షణాలు లేకుండా వృద్ధి చెందుతుందన్నారు. క్రమం తప్పకుండా నేత్ర పరీక్షలు చేయటం వలన ఈ వ్యాధిని గుర్తించి చికిత్సను అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
నాకు న్యాయం చేయండి
పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక నారాయణ కళాశాల సమీపంలో నివాసముంటున్న అమరావతి అనే మహిళ తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. సోమవారం పులివెందులలో ఆమె మాట్లాడుతూ తనకు ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారన్నారు. వీరపునాయునిపల్లె మండలం గోనుమాకుపల్లె గ్రామానికి చెందిన ప్రసాద్‌రెడ్డితో 2007లో వివాహమైందన్నారు. తన భర్త, వారి కుటుంబ సభ్యులందరూ మానసికంగా, ఆరోగ్యంగా లేరన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా తన భర్త కుటుంబానికి ఉన్న 30 ఎకరాల ఆస్తి కాజేయాలని తన తమ్ముడు వివాహం జరిపించాడన్నారు. దీనికితోడు 2024 సంవత్సరంలో తనపైన, తన కుమార్తైపెన దాడి చేశాడన్నారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. పోలీసులు స్పందించలేదన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు కోల్పోయే ప్రమా


