‘సాయి’ మార్గం అనుసరణీయం | - | Sakshi
Sakshi News home page

‘సాయి’ మార్గం అనుసరణీయం

Nov 24 2025 7:36 AM | Updated on Nov 24 2025 7:36 AM

‘సాయి’ మార్గం అనుసరణీయం

‘సాయి’ మార్గం అనుసరణీయం

‘సాయి’ మార్గం అనుసరణీయం

కడప సెవెన్‌రోడ్స్‌: శ్రీ సత్యసాయి మార్గం అందరికీ అనుసరణీయమని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జేసీ అదితి సింగ్‌, డీ ఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మానవాళికి సేవ చేయడమే భగవంతుని సేవ’ అనే నమ్మకాన్ని సత్యసాయి బాబా ప్రచారం చేశారని అన్నారు. ఆయన అందించిన ‘లవ్‌ ఆల్‌.. సర్వ్‌ ఆల్‌ ’ నినాదాన్ని ఆధ్యాత్మిక భావాలను అనుసరించాలని కోరారు. జేసీ మాట్లాడారు. ఎస్డీసీ వెంకటపతి, డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి, జిల్లా పర్యాటకశాఖ అధికారి సురేష్‌ , కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement