కనీస మద్దతు ధరతో వరి కొనుగోలు
– జాయింట్ కలెక్టర్
కడప సెవెన్‌రోడ్స్ : ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరతో జిల్లాలో పౌరసరఫరాలసంస్థ ద్వారా వరి కొనుగోలు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ రకం క్వింటాలుకు రూ. 2369, గ్రేడ్–ఏ రకం రూ. 2389 చొప్పున రైతుల నుంచి సేకరిస్తామన్నారు. మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ఈనెల 19వ తేదీ నుంచి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఈ–క్రాప్, ఈకేవైసీతోపాటు తమ పేర్లు నమోదు చేయించుకున్న రైతులు మాత్రమే వరి విక్రయించేందుకు అర్హులన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న వరి మాత్రమే కొనుగోలు చేస్తామన్నారు. రవాణా ఖర్చులు రైతులే భరించాలని, ప్రభుత్వం ఆ తర్వాత రైతు ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తుందన్నారు. హమాలీ, గోనె సంచులను పౌరసరఫరాల సంస్థే సరఫరా చేస్తుందన్నారు. లేదా రైతులే ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం ఆ ఖర్చులను రైతులకు చెల్లిస్తుందన్నారు. కొనుగోలు చేసిన మొత్తాన్ని ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుందన్నారు.
కొనుగోలు కేంద్రాలు..
బి.కోడూరు, బ్రహ్మంగారిమఠం, చక్రాయపేట, చాపాడు, చెన్నూరు, సీకే దిన్నె, దువ్వూరు, జమ్మలమడుగు, కడప, కమలాపురం, పెండ్లిమర్రి, బద్వేలు, కలసపాడు, ఖాజీపేట, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, రాజుపాలెం, మైదుకూరు, సిద్దవటం, కాశినాయన, వల్లూరు, వేంపల్లె, ఒంటిమిట్ట, ఎర్రగుంట్ల, కొండాపురం మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని జేసీ వివరించారు.
గుడి తిరునాల ఏర్పాట్ల పరిశీలన
కలసపాడు : కలసపాడులో డిసెంబర్ 2, 3 తేదీల్లో జరగనున్న గుడి తిరునాల ఏర్పాట్లను పోరుమామిళ్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హేమసుందర్‌రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా చర్చి కమిటీ వారితో వాహనాల పార్కింగ్, జన సేకరణపై డీనరీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌తో కలిసి చర్చి ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పోరుమామిళ్ల, కాశినాయన ఎస్‌ఐలు కొండారెడ్డి, యోగేంద్ర, చర్చి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీని తనిఖీ చేసిన
డీఎంహెచ్‌ఓ
దువ్వూరు : దువ్వూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తనిఖీ చేశారు. డాక్టర్లు, వైద్య సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. పీహెచ్‌సీకి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రోషిణి, హేమలత, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
రాజుపాళెం : పుట్టు అంధుడైన సంజీవరాయశర్మ గణిత పరిజ్ఞానంలో అపర ప్రజ్ఞాశాలి అని మండల విద్యాశాఖాధికారి ప్రసాద్ తెలిపారు. రాజుపాళెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సంజీవరాయ శర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ అన్ని తెలిసిన వారే లెక్కల్లో తప్పులు చేస్తూ తడబడుతూ ఉంటారన్నారు. అలాంటిది అంధుడైనా లెక్కలు అలవోకగా చెప్పగల సమర్థుడు సంజీవరాయ శర్మ అన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం వసుంధరదేవి, విజయమోహన్‌రెడ్డి తెలిపారు.
క్రీడా స్ఫూర్తితో రాణించాలి
పులివెందుల టౌన్ : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించాలని ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర ఎస్‌జీఎఫ్ ఇంటర్ జిల్లా స్థాయి అండర్–14 సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు శ్రీకాంత్‌రెడ్డి, విక్టర్ ఇమ్మానుయేల్, శివశంకర్‌రెడ్డి, ప్రవీణ్ కిరణ్, విజయ ప్రసాద్‌రెడ్డి, కొండారెడ్డి, రామాంజనేయులు, ఎంఈఓలు రామానాయుడు, రామచంద్రారెడ్డి, అంగడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
కనీస మద్దతు ధరతో వరి కొనుగోలు
కనీస మద్దతు ధరతో వరి కొనుగోలు
కనీస మద్దతు ధరతో వరి కొనుగోలు


