27 నుంచి సెమిస్టర్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ పీజీ కళాశాలల మూడో సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 27వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కేఎస్‌వీ కృష్ణారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్‌ను ఆయన ప్రకటించారు. ఈ నెల 27,29 డిసెంబర్ 1,3,5,8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 1గంట వరకూ పరీక్షలు జరుగుతాయని అందులో పేర్కొన్నారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన యూనివర్సిటీ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఈ నెల 25వ తేది ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రధా నాచార్యులు టి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు పిహెచ్‌డి./ఎం.టెక్. (ఏదైనా కంప్యూటర్ స్ట్రీమ్) / ఎంసీఏ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థుల బయోడేటా, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు అలానే సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల సెట్‌తో నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. వివరాల కోసం www.yvu.edu.inని సందర్శించాలని సూచించారు.
కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో మొదటి సంవత్సరం స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధానాచార్యులు డా.జి.రవీంద్రనాథ్ తెలిపారు. బీఏ (స్పెషల్ తెలుగు, హిస్టరీ,ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, స్పెషల్ ఉర్దూ) , బీకాం జనరల్, బీబీఏ కంప్యూటరు అప్లికేషన్స్, బీఎస్సీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, మాథమాటిక్స్, జియాలజీ, బయో టెక్నాలజీ, స్టాటి స్టిక్స్, కంప్యూటరు సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) and dairy science ఆనర్సు మొదటి సంవత్సరం కోర్సుల కోసం అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. అడ్మిషన్లకు నవంబర్ 24 చివరితేదీ అని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు కళాశాలలో నేరుగా సంప్రదించి అడ్మిషన్లు పొందాలని ప్రిన్సిపాల్ సూచించారు.
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మున్సిపల్ ఇన్‌చార్జి మాజీ చైర్మన్ వీఎస్ ముక్తియార్‌ను ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ సొసైటీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీ నేతగా ఉన్న ముక్తియార్ ప్రస్తుతం అంజుమన్ అహలె కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు.పలువురు ముస్లిం మైనారిటీ నాయకులు ముక్తియార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముక్తియార్ మాట్లాడుతూ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.


