అనధికార లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో అనధికార లే అవుట్లు, నియమ నిబంధనలు ఉల్లంఘించిన భవన నిర్మాణాలు చేపడుతున్న వారు వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి జనవరి 23 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.రాజ్యలక్ష్మి తెలిపారు. శనివారం తన కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం బీపీఎస్ 2025 అనే పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ఈ యేడు ఆగస్టు 31వ తేదికి ముందు నిర్మించిన భవనాలకు ఇది వర్తిస్తుందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు ఈ పరిధిలోకి వస్తాయన్నారు. అక్టోబరు 23 నాటికి ముగిసిన అనధికార లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీరణకు మరో మూడు నెలలు గడువు పొడిగించారన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌లో క్రమబద్ధీకరణ చేసుకోని ప్లాట్లకు బిల్డింగ్ అనుమతులు మంజూరు చేయబోమని స్పష్టం చేశారు. అలాగే బ్యాంకు రుణాలు కూడా మంజూరు కావన్నారు. ఇతర వివరాలకు 98499 66639, 91779 93386 నెంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ పరిపాలన అధికారి ఖాదర్‌బాష, కుడా ఏపీఓ సీడీ కృష్ణసింగ్ తదితరులు పాల్గొన్నారు.


