అన్ని విధాలా నష్టమే..
ముందుగా సాగుచేసిన వరిపంట కోతకు సిద్ధంగా ఉంది. సిద్ధమైన వరిపంటను కోసేందుకు చాలామంది రైతులు వరిపంట భూములను ఆరబెట్టుకున్నారు. ఇప్పుడేమో వర్షం రాకతో నేల తడిగా మారింది. దీంతో పెద్దమిషన్ల(టైర్ల మిషన్)తో కోతలు కోసుకునేందుకు వీలుకాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. టైర్ల మిషనైతే గంటకు 18 వందల నుంచి 2 వేలు ధర ఉంది. ప్రస్తుతం బురద ఉండడంతో చైన్ మిషన్‌తో కోత కోసుకోవాలి. చైన్ మిషన్ గంటకు రూ. 3500 అవుతుందని దీంతో ఖర్చు పెరుగుతుందని పైగా పశువుల మేతకు చెత్త పనికిరాకుండా పోతుందని పలువురు రైతులు వాపోతున్నారు.


