ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం
కడప అగ్రికల్చర్: జిల్లా మత్య్సశాఖ కార్యాలయంలో శుక్రవారం ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ మత్స్య కార్మికులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రాంప్రసాద్, మత్స్య అభివృద్ధి అధికారి కిరణ్‌కుమార్, పలువురు మత్య్సకారులు పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించనున్న ‘విద్యార్థి అసెంబ్లీ’కి జిల్లాలోని ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో నియోజవర్గానికి ఒక్క విద్యార్థి చొప్పున ఎంపిక చేశారు. వీరంతా జాతీయ రాజ్యాంగ దినోత్సవం రోజు అసెంబ్లీకి హాజరవుతారు. మైదుకూరు నియోజక వర్గం శెట్టివారిపల్లె జెడ్పీ హైస్కూల్ నుంచి వీర ఉదయశ్రీ, ప్రొద్దుటూ రు నియోజక వర్గం నుంచి ప్రొద్దుటూరు వైవీ ఎస్ బాలికల హైస్కూల్ నుంచి షేక్ యల్లాల ఆసిఫా, జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల బాలికల హైస్కూల్ నుంచి మేడిక సంగీత, కమలాపురం నియోజకవర్గం నుంచి కమలాపురం బాలుర హైస్కూల్ విద్యార్థి వడ్ల తేజ నరసింహాచారి, పులివెందుల నియోజక వర్గంలోని సింహాద్రిపురం మండలం హిమకుంట్ల జెడ్పీ హైస్కూల్‌కు చెందిన డి. నాగవైష్ణవి, కడప నియోజక వర్గంలోని కడప ఎంసీహెచ్‌ఎస్ ఉర్దూ మొయిన్ బాలుర హైస్కూల్‌కు చెందిన సయ్యద్ మహహ్మద్ ఆనస్, బద్వేల్ నియోజకవర్గంలోని బి.కోడూరు మండలంలోని కేజీబీవీకి చెందిన యోగ వర్షితరెడ్డి ఎంపికై న వారిలో ఉన్నారు.


